- కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సదాశివ నగర్ మండలం లోని ZPHS పద్మాజివాడి పాఠశాలను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ZPHS పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. గత సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు.గత సంవత్సరం 10 వ తరగతి విద్యార్థుల్లో నలుగురు విద్యార్థులకు IIIT బాసరలో సీటు వచ్చిన సందర్భంగా శాలువాతో వారిని సన్మానించారు.అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 100% ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం MDM కార్మికులతో మాట్లాడుతూ విద్యార్థులకు ఆహారం రుచికరంగా ఉండేలా చూసుకోవాలి, వేడిగా వంటలను వడ్డించాలని నాణ్యత పాటించాలని చెప్పడం జరిగింది.