మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలి  – జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ వెనుక భాగంలో నిర్మిస్తున్న మహిళాశక్తి భవనం పనులను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళాశక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. నిర్మాణం పనులను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు 5 కోట్ల రూపాయలతో పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణం పనులు నాణ్యతతో చేపట్టాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణం పనులు పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, చందర్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్,డి ఈ దుర్గాప్రసాద్, ఇంజనీర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment