*దేవునిపల్లి ప్రాథమిక పాఠశాలో వన మహోత్సవ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్*   

*దేవునిపల్లి ప్రాథమిక పాఠశాలో వన మహోత్సవ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్*

 

*మొక్కల సంరక్షణ బాధ్యత అందరిదీ*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 19

 

 

ప్రకృతిలో మొక్కల సంరక్షణ బాధ్యత అందరూ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం దేవుని పల్లి ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి మొక్కల సంరక్షణ బాధ్యతను అన్ని శాఖల వాళ్ళు స్వీకరించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఆయన ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో సంభాషించారు. వారి సామర్థ్యాలను పరీక్షించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో గుణకారాల కృత్యాలను చేయించారు .

ఉపాధ్యాయులు ఎఫ్ ఎల్ ఎన్, ఇతర విద్యాశాఖ కార్యక్రమాలను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు యూనిఫారం లు అందాయా లేదా అన్న విషయం విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అంటూ విద్యార్థులను కనుక్కున్నారు. పాఠశాల ప్రాంగణంలో వంటశాలను పరిశీలించి పరిశుభ్ర వాతావరణం లో విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య క్వాలిటీ కోఆర్డినేటర్ వేణుగోపాల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు గంగా కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment