కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్.

కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్.

 

కామారెడ్డి జిల్లా

 

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 13

 

బుధవారం రోజున కామారెడ్డి పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి చందర్ మరియు మున్సిపల్ కమిషనర్, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, తహసీల్దార్ ఇతర అధికారులతో కలిసి విద్యానగర్ కాలనీలోని సాయిబాబా గుడి వద్ద పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధిక వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో డ్రైనేజీలు బ్లాక్ అయి మురుగునీరు రోడ్ల మీదికి, ఇండ్లలోకి రాకుండా ముందస్తుగా అన్ని డ్రైనేజీలను శుభ్రం చేయాలని, రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, తడి మరియు పొడి చెత్త ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ప్రతిరోజు మున్సిపల్ వాహనాల ద్వారా చెత్తను సేకరించి డిస్పోజల్ చేయాలని, పట్టణంలో ఎక్కడ వర్షం నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని, దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని, ఫాగింగ్ చేయాలని, భారీ వర్షం సంభవించినప్పుడు పట్టణ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రాకుండా ముందస్తుగా ప్రచారం కల్పించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు పనిముట్లను అందజేసి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పనిచేసే కార్మికులకు రైన్ కోట్స్ మరియు అత్యవసరమైన ఇతర సామాగ్రి అందజేయుటకు వెంటనే ప్రపోజల్స్ పంపించవలసిందిగా ఆదేశించినారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now