ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 18
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆకస్మికంగా కామారెడ్డి పట్టణంలో పర్యటించి వివిధ డిపార్ట్మెంట్స్ యొక్క పనులను పర్యవేక్షించినారు ముందుగా కామారెడ్డి పట్టణంలో అమృత్ పథకంలో భాగంగా నిర్మాణం చేయబడుతున్న పైపు లైన్ పనులను కళాభారతి వద్ద సంబంధిత పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మున్సిపల్ కమిషనర్ మరియు మెగా సంస్థ తో కలిసి పర్యవేక్షించి పనులను వేగవంతంగా చేయవలసినదిగా ఆదేశించినారు మరియు నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నీటి లైన్ ను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించినారు అనంతరం కొత్త బస్టాండ్ వద్ద గల డ్రైనేజీ పూడిక తీయు కార్యక్రమాన్ని పరిశీలించి కూడికనుండి తీసిన వ్యర్ధాన్ని వెంటనే అక్కడి నుండి తొలగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించినారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించి అక్కడ సిబ్బంది హాజరు మరియు విద్యార్థుల హాజరు పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం మొక్కలు నాటారు ఇట్టి కార్యక్రమంలో డీఈవో ఎంఈఓ మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు