Site icon PRASHNA AYUDHAM

కొణిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్  —ఆశిష్ సాంగ్వన్

IMG 20250704 WA0229

కొణిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్

—ఆశిష్ సాంగ్వన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 4

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోశయ్య 4వ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొనిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2009 నుండి 2010 సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తదనంతరం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ గా పనిచేయడమే కాకుండా చాలా పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసి తన రాజకీయ అనుభవంతో ప్రజలకు విశేష సేవ చేశారని ఆయన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చందర్ నాయక్, విక్టర్, రవికుమార్, టిజిఓ సెక్రటరీ సాయి రెడ్డి, టిఎన్జీవో అధ్యక్షులు వెంకట్ రెడ్డి, మరియు సభ్యులు, జిల్లా అధికారులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, కలెక్టరేట్ ఏవో సయ్యద్ మసూద్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version