*ప్రజావాణి లో వచ్చిన పెండింగ్ అర్జీలను పరిష్కరించండి*
…….జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పలు శాఖల్లో పెండింగులో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇప్పటి వరకు 19501 అర్జీలు రాగా, 18838 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, ఇంకనూ 663 అర్జీలు పెండింగులో ఉన్నాయని తెలిపారు. ఈ రోజు(71) అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. ఆయా శాఖల అధికారులు పెండింగులో ఉన్న అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా దినపత్రికల్లో వస్తున్న వ్యతిరేక వార్తలకు రేజాయిన్డర్స్ వెంటనే పంపించాలని తెలిపారు.
ఆదివారం రోజున లాంఛనంగా ప్రారంభించిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు, 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినందులకు అధికారులకు, ఉద్యోగులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
కొత్తగా రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల, మున్సిపల్ లోని ప్రజాపాలన కేంద్రాల్లో నాలుగు పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పై వచ్చిన ఫిర్యాదులను పురస్కరించుకొని దరఖాస్తులను ఫిజికల్ గా పరిశీలించాలని తెలిపారు. ఒకే కుటుంబం లో రెండు, మూడు ఇండ్లు మంజూరు అయినట్లు పత్రికల్లో వచ్చిన వార్తల(ఇతర జిల్లాల్లో) ఆధారంగా పంచాయతీ కార్యదర్శులు మరొకసారి లబ్ధిదారుల ఇండ్లు పరిశీలించాలని తెలిపారు.
ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్, పలు శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.