విద్యాసంస్థలను జూన్ 12న పునః ప్రారంభానికి సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యాసంస్థలను జూన్ 12న పునః ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ దోమకొండ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల, వసతి గృహం, భోజనశాల,నివాసం, స్టోర్ రూం, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి సెలవులలో విద్యార్థులు లేకపోవడం మూలంగా ఉపయోగించకపోవడంతో తరగతి గదులు, వసతి గదులు, భోజనశాల, మరుగుదొడ్లు, విద్యాలయం ఆవరణ కొంచెం దుమ్ము, ధూళి, చెత్తతో ఉంటాయని సిబ్బందితో మొత్తం క్లీన్ చేయించాలని, విద్యాలయం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి మొక్కలు నాటాలని, వాటర్ ట్యాంకులను పరిశుభ్రంగా కడిగించి ఎక్కడ లీక్ లేకుండా పైపుల ద్వారా అన్ని అవసరాలకు ఉపయోగపడేలా సిద్ధం చేయాలని, డార్మెటరీ పైన డోమ్ పైకప్పు గాలితో దెబ్బతిన్నందున సరి చేసి వర్షం నీరు దార్మట్ లో పడకుండా చూడాలని, విద్యార్థుల ఆహారం కోసం ఉపయోగించే సరుకులను నాణ్యమైన వాటిని వాడాలని కళాశాల ప్రిన్సిపాల్ చైతన్య ను ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జూన్ 12 న విద్యాసంస్థల పునః ప్రారంభం ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల జోనల్ ఆఫీసర్ పూర్ణచంద్రరావును ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జ్యోతి, డీఎస్సీడివో వెంకటేష్ ఎంపీడీవో ప్రవీణ్, గురుకుల విద్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment