రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం ఆగష్టు 12కామారెడ్డి

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి అధ్యాపకుల విద్యార్థుల సహకారంతో ఈ కాలేజీ పూర్వ విద్యార్థి కీర్తిశేషులు జెర్సీ బాల్రాజ్ గౌడ్ జ్ఞాపకార్థం కాలేజ్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరం నిర్వహించరు

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు , అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. అవసరమన్న వారికి ఆపదలో రక్త దానం చేసి ప్రాణాలు కాపాడాలని, ముఖ్యంగా యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రక్తదాన విషయంలో రాష్ట్రంలోనే ముందుండాలని అన్నారు. మన జిల్లాకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా రక్తాన్ని అందిస్తున్నామని, మన జిల్లాలోని జిల్లా అధికారులు, మరియు సిబ్బంది తప్పకుండా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని ప్రతి ప్రజావాణిలో కోరుచున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న , కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధులు రఘుకుమార్, దస్థిరం, నరసింహం, రమేష్ రెడ్డి, కాలేజీ అధ్యాపకులు శ్రీనివాస్ రావు, సుధాకర్, కీర్తిశేషులు బాలరాజు భార్య, పిల్లలు, విద్యార్థిని, విద్యార్థులు హాజరయ్యారు.

Join WhatsApp

Join Now