ఎన్డిఆర్ఎఫ్ చే మాక్ డ్రిల్ లో సంబంధిత యంత్రాంగం పాల్గొనాలి  – జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ఎన్డిఆర్ఎఫ్ చే మాక్ డ్రిల్ లో సంబంధిత యంత్రాంగం పాల్గొనాలి

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

వర్షాకాలంలో వచ్చే విపత్తులు, వరదలు వలన ప్రజలను అప్రమత్తం చేయడానికి ఎన్డిఆర్ఎఫ్ చే మాక్ డ్రిల్ లో సంబంధిత యంత్రాంగం పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పోలీసు, రెవిన్యూ, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలు, సంఘటనల ఆధారంగా జిల్లాలో వరదల నేపథ్యంలో ప్రజలను సురక్షత ప్రాంతాలకు తరలించడం, అప్రమత్తం చేయడం వంటి కార్యక్రమాలను ప్రత్యక్షంగా మాక్ డ్రిల్ ద్వారా మంగళవారం స్థానిక పట్టణంలోని జీ.ఆర్.కాలనీ, జీవధాన్ ప్రాంతాలలో ఎన్.డి.ఆర్.ఎఫ్. వారిచే నిర్వహించే కార్యక్రమానికి సంబంధిత అధికారులు పాల్గొనాలని తెలిపారు. అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి. విక్టర్ మాట్లాడుతూ, ప్రమాదాలు, వరదలు సంభవించినపుడు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. రేపు జరిగే మాక్ డ్రిల్ లో పాల్గొనాలని తెలిపారు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ, శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయ కార్యక్రమాలు నిర్వహించడం జరగాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ఈ ఈ రవిశంకర్, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, జిల్లా ఫైర్ అధికారి సుధాకర్, మున్సిపల్ కమిషనర్ లు రాజేందర్, శ్రీహరి, మహేష్, పలు శాఖల అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now