Site icon PRASHNA AYUDHAM

ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియను వేగవంతం చేయాలి :జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

IMG 20250325 WA0022

ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియను వేగవంతం చేయాలి :జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

మంగళవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎల్.ఆర్.ఎస్. క్రింద చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లే అవుట్ల క్రమబద్దీకరణకు ఈ నెల 31 తో ముగిస్తున్నందున దరఖాస్తుదారులు త్వరితగతిన ఫీజు చెల్లించి 25 శాతం రిబెట్ పొందవచ్చని తెలిపారు. దరఖాస్తు దారులు సకాలంలో లే అవుట్ల క్రమబద్దీకరణ చేయించుకోవాలని తెలిపారు. దరఖాస్తు దారులు రుసుము చెల్లించిన 48 గంటల్లోగానే ప్రొసీడింగ్స్ జారీచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. రాజేందర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ వెనుగోపాల్, టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version