జిల్లాలో డ్రగ్స్ గంజాయి కల్తీకల్లు నిర్మూలనకు అధికారులు కృషిచేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సూచించారు.

కామారెడ్డి జిల్లా ఇంఛార్జి 

(ప్రశ్న ఆయుధం) జూలై 17

 

కామారెడ్డి జిల్లాలో డ్రగ్స్ గంజాయి కల్తీకల్లు వంటి మత్తు పదార్థాలను అరికట్టే కార్యాచరణ లో భాగంగా 11 వ జిల్లా NCORD మీటింగ్ ఈ రోజు జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వన్ అధ్యక్షతన IDOC లో జరిగినది.ఈ సమావేశంలో పాల్గొన్న సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ 10 వ మీటింగ్ లో తీసుకున్న కార్యాచరణ ప్రణాళికను సమీక్షించి భవిష్యత్తు లో చేయవలసిన కార్యక్రమాలకు దిశా నిర్దేశం చేసినారు.గంజాయి , కల్తీకల్లు వంటి మత్తు పదార్థాలు తాగే వారి అలవాటు మనిపించడం కోసం Ngo లు మరియు వైద్య ఆరోగ్య శాఖ సహకారం తో వారిని ఆ అలవాటు నుండి బయట పడే విధంగా చేయాలని కోరారు.జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, విద్యార్థుల కు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు వివరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.జిల్లా అధికారులు అందరూ పూర్తి సహకారం తో కామారెడ్డి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా గా చేయాలని కోరారు. జిల్లా sp శ్రీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ NDPS చట్టం అమలు చేసేటప్పుడు సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చట్టం లో ని నిబంధనల ను తు చ తప్పకుండా పాటించాలని ,డ్రగ్స్ బారిన పడిన వ్యక్తులను వారి యొక్క ప్రవర్తన, శారీరక లక్షణాలు బట్టి గుర్తించి వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు డి అడిక్షన్ సెంటర్ లో చేర్పించి అదే విధంగా కుటుంబ సభ్యుల సహకారంతో వారిని చైతన్య పరిచి ఆ అలవాటు నుండి బయటపడేలా చేయాలని కోరినారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీ విక్టర్ , జిల్లా EXCISE అధికారి శ్రీ B.హనుమంతరావు,DEO రాజు,DMHO చంద్రశేఖర్, DWO ప్రమీల,TGNAB CI ,వివిధ NGO సంఘాలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now