Site icon PRASHNA AYUDHAM

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

IMG 20250324 WA0096

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ రోజు పలు సమస్యలపై (131) అర్జీలు రావడం జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ , ప్రజావాణిలో వచ్చిన అర్జీల పెండెన్సీలను సంబంధిత అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు 20,370 అర్జీలు రాగా, ఆయా అధికారులు పరిశీలించి 19,567 అర్జీలను పరిష్కరించడం, చర్యలు తీసుకోవడం జరిగిందని, 803 అర్జీలు పెండింగులో ఉన్నాయని, వాటిని వచ్చే వారం లోగా పరిష్కరించాలని అన్నారు. అదేవిధంగా పెండింగులో ఉన్న ధరణీ దరఖాస్తులను పరిశీలించి డిస్పోజ్ చేయాలని తహసీల్దార్లు, ఆర్డీఓ లను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉంటే వెంటనే మార్క అవుట్ ఇవ్వాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలని, ఎంపీడీఓ లు, ఎంపీఒ లు పర్యవేక్షించాలని తెలిపారు. 

అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ మాట్లాడుతూ, రేషన్ కార్డుల కొరకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటిని రెవిన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వాటిని ఎంపీడీఓ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ లు విచారణ చేయాలని తెలిపారు.

ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ వీణ, జడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Exit mobile version