జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్, పరిశుభ్రమైన మరుగుదోడ్ల వివరాలు డిసెంబర్ 5 లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మున్సిపల్, పంచాయితీ, రైల్వే తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మాన్యువల్ స్కావేంజర్, ఇన్సానిటరీ టాయిలెట్స్ వివరాలు ప్రభుత్వానికి సమర్పించవలసిన ఉందని, జిల్లాలోని పంచాయితీ, మున్సిపల్, రైల్వే పరిధిలో ఉన్నట్లయితే అట్టి వివరములు జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి కార్యాలయమునకు డిసెంబర్ 5 లోగా సమర్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, సి.పి.ఒ. రాజారాం, మున్సిపల్ డిప్యూటీ ఈఈ వేణు గోపాల్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.