కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సేకరణ త్వరగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి – తేది 03-3-2025

IMG 20250303 WA0090

మిల్లింగ్ రైస్ సేకరణ త్వరగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం పౌర సరఫరాల అధికారులతో తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2023-24 రబీ, 2024-25 ఖరీఫ్ కాలమునకు సంబంధించిన సి.ఏం.ఆర్. సేకరణకు మిల్లులను తనిఖీ చేయాలనీ అన్నారు. సహాయ పౌరసరఫరాల అధికారులు, ఎన్ ఫోర్స్ డిప్యూటీ తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి సి.ఏం.ఆర్. సేకరణకు మిలర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షేత్ర స్థాయి సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలని, అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు చేపట్టాలని అన్నారు. సి.ఏం.ఆర్. సరఫరా చేయని మిల్లుల యజమానులకు నోటీసులు జారీచేయాలని తెలిపారు. 2023-24 రబీ సీజన్లో 122064 టన్నుల డెలివరీ చేసి 58 శాతం పూర్తి చేసినారని, 94,295 టన్నుల సి.ఏం.ఆర్. ను మార్చి 17 నాటికి వంట శాతం పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా 2024-25 ఖరీఫ్ సి.ఏం.ఆర్. సేకరణకు సంబంధించి ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేయవలసిన బియ్యాన్ని జిల్లా టార్గెట్ 3 వేల టన్నుల త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now