విద్యార్థి విజ్ఞాన్ మంథన్ బ్రోచర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

విద్యార్థి విజ్ఞాన్ మంథన్ బ్రోచర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

 

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 8,

కామారెడ్డి కలెక్టరేట్‌లో విద్యార్థి విజ్ఞాన్ మంథన్ బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి ఆధ్వర్యంలో వివరణాత్మకంగా వివరాలు అందించారు.

కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న శాస్త్రీయ, సృజనాత్మక ఆలోచనలను వెలికితీసి పరిశోధన, ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించడమే ఈ పరీక్ష లక్ష్యమని చెప్పారు. కేంద్ర సాంకేతిక సమాచార సంస్థ ఆధ్వర్యంలో, , ఎన్సీఈఆర్టీ, ఎన్ సి ఎస్ ఎం విజ్ఞాన భారతి సంయుక్తంగా ఈ జాతీయ స్థాయి ప్రతిభ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనవచ్చని, ప్రతిభ కనబరిచిన వారికి ప్రముఖ పరిశోధనా సంస్థల్లో స్కాలర్షిప్, ఇంటర్న్షిప్ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి విజ్ఞాన్ మంథన్ జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now