*మద్నూర్ మండలంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మిక పర్యటన*

*మద్నూర్ మండలంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మిక పర్యటన*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 30.

 

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం మద్నూర్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి, పర్యవేక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

పర్యటనలో భాగంగా మద్నూర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) ని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై నేరుగా రోగులు మరియు వైద్య సిబ్బందితో మాట్లాడి సమాచారం పొందారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా వైద్య సిబ్బంది నిరంతరం నిరంతరం అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని, సాధారణ మందులతోపాటు పాముకాటు మరియు ఇతర అత్యవసర మందులు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, సానిటేషన్ పనులు నిరంతరం చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు.

 

తదుపరి హండీ కీలూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి, 100 శాతం మార్కింగ్ అవుట్‌లు చేయాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షణ చేసి ఇండ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసుకునేలా లబ్ధిదారులకు సహకరించాలని ఎంపీడీవోను ఆదేశించారు.

 

అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించి, లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇసుక మరియు మొరం సరఫరాకు ఏమైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఎంపీడీవోకు మరియు తాసిల్దార్ కు తెలియజేసి సమస్య పరిష్కరించాలని సూచించారు.

 

వర్షాకాలం దృష్ట్యా గ్రామ పంచాయతీలలో ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించి, త్రాగునీటిని క్లోరినేషన్ చేయాలని, డ్రైనేజీలలో నీరు నిలువ ఉండకుండా పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

 

తదుపరి పెద్ద ఎక్లారా గ్రామంలోని గురుకుల పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో

 

సబ్ కలెక్టర్, బాన్సువాడ కిరణ్మయి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్, డివిజనల్ పంచాయతీ అధికారి సత్యనారాయణ, హౌసింగ్ డిఇ గోపాల్, తహసిల్దార్ ముజీబ్, ఎంపీడీవో, తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment