భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అన్ని అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

    భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అన్ని అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. 

మంగళవారం దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవిన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా రైతులతో మాట్లాడి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కరించడం కోసమే ప్రభుత్వం భూభారతి ఆర్ఓఆర్ చట్టం తీసుకు వచ్చిందని ఎలాంటి భూ సమస్యలు ఉన్న రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ సిబ్బంది చేస్తున్న కసరత్తును పరిశీలించి రెవెన్యూ సదస్సులలో రైతులు పెట్టుకునే ప్రతీ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి అర్జీని మరియు ఆ అర్జీకి సంబంధించిన భూ వివరాలను రెవెన్యూ రికార్డులలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. దరఖాస్తులన్నింటిని కచ్చితంగా ఆన్లైన్లో పొందుపరిచాలని, ఆలస్యం చేయకుండా అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి సాదా బైనామ, సీలింగ్, సర్వేనెంబర్, భూవిస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, లావని పట్టా అన్ని రకాల భూ సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించేలా పనిచేయాలని తాసిల్దార్ సుధాకర్ మరియు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.                అలాగే ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మించుకునేలా చూడాలని, ఇంకా ప్రారంభించని ఇండ్ల నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలని ఎంపీడీవో ప్రవీణ్ ను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా లబ్ధిదారులు ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వీణ, మండల ప్రత్యేక అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment