సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ నోటిఫికేషన్ జారీకి సంగారెడ్డి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమై ఉందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రావీణ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో అక్టోబర్ 9న 12 జడ్పిటిసి స్థానాలు, 129 ఎంపిటిసి స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయని, పునఃశిక్షణ కూడా అందించారని పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలను ఇప్పటికే నియమించామని కలెక్టర్ వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని రిపోర్టులు సమయానికి పంపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, ఆర్డీఓలు, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి జిల్లా యంత్రాంగం సిద్ధం: జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రావీణ్య
Oplus_131072