గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 16:
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. గ్రూప్ 2 రెండవ రోజున జరిగిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం రోజున తనిఖీ చేశారు.
కేంద్రంలో ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాలు త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, మెడికల్ సేవలు పై చీఫ్ సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. తొలుత సి.ఎస్. రూం లో ఏర్పాటుచేసిన సి.సి. కెమరా, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్, కేంద్రంలోని గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.కిష్టయ్య , డిపార్టుమెంటల్ అధికారిణి రజిత, ఆర్డీఓ రంగనాథ్ రావు, తహసీల్దార్ జనార్ధన్, తదితరులు ఉన్నారు.
Post Views: 6