అంతర పంటల సాగు ద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి చెందవచ్చు. జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 8 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
రైతులు ఒకే పంట మీదే ఆధారపడకుండా అంతర్ పంటల సాగు ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందవచ్చు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శనివారం ములకలపల్లి మండలంలో కలెక్టర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మట్టితో తయారుచేసిన ఇటుకలు తో నిర్మించే ప్రహరీ గోడ పనులను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ ప్రహరీ గోడ నిర్మాణానికి స్థానికంగా మట్టితో తయారుచేసిన ఇటుకలను ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పాతూరులో ఈదర మురళి అనే రైతు సాగు చేస్తున్నటువంటి ఫామ్ పౌండ్ లో చేపల పెంపకాన్ని పరిశీలించి, ఇంకా ఫామ్ పాండ్ అభివృద్ధి పరచటానికి మరియు ఏ రకం చేపల పెంపకం ద్వారా ఎక్కువ ఆదాయం చేకూరుతుందో తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఒక్క పంట పైనే ఆధారపడకుండా అంతర్ పంటగ చేపల పెంపకం, మునగ, నాటు కోళ్లు మరియు తేనెటీగల పెంపకం వంటివి సాగు చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు. ఈ అంతర పంటల సాగుకు ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా మునగ పంట వేసుకున్న వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు సబ్సిడీలు అందుతాయని అదేవిధంగా పంట చేనులో ఫారం ఫాండ్లు ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా తీయడం జరుగుతుందని ఈ ఫారం పాండ్లలో రైతులు చేపల పెంపకం చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఎంపీడీవో రేవతి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now