ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ములుగు అటవీ ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐలాండ్ సందర్శనకు గ్రామస్థులను పంపించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్
అంతకు ముందు హైదరాబాద్ లోని వీ లీవ్ ఇన్ బాంబు నైన్ మరియు ఐకీయ సందర్శన.కేరళ రాష్ట్రం వయానాడ్ జిల్లాలోని ఊరవు వెదురు శిక్షణ కేంద్రం సందర్శన.
జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పరచడమే లక్ష్యంగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని ప్రత్యేకమైన పర్యటక ప్రాంతాలు మరియు ఇక్కడ గిరిజనుల సాంస్కృతి సాంప్రదాయాలు బాహ్య ప్రపంచానికి తెలియజేసి పర్యాటక రంగంగా అభివృద్ధి పరచాలని జిల్లా కలెక్టర్ ముఖ్య ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ చొరవతో జిల్లాలో భద్రాచలం ఐటిడిఏ పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం, గోదావరి ఘాట్ వద్ద రివర్ సైడ్ క్యాంపెనింగ్, బుజ్జి గుప్ప గిరిజన గృహాల సందర్శన , బెండలంపాడు, తుమ్మలచెరువు మరియు పూబెల్లి లో పర్యాటక రంగా అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్న నేపథ్యంలో అధికారులకు మరియు ఆయా గ్రామ సభ్యులకు పర్యాటకరంగా అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు మరియు అవలంబించాల్సిన పద్ధతులు పై మరింత అవగాహన పెంపొందించేందుకు వీలుగా వివిధ ప్రాంతాలలో తయారయ్యే ప్రత్యేక వస్తువులు, తయ్యారి పద్ధతులు మరియు వంటకాలు తయారీలో అవలంబించే పద్ధతులు తెలుసుకొని తద్వారా జిల్లాలో ఆ పద్ధతులు ఉపయోగించి జిల్లా ప్రత్యేకమైన వంటకాలను మరింత నాణ్యత మరియు రుచిగా పర్యాటకులకు అందించేదుకు వీలుగా జిల్లా నుండి కొంతమంది సభ్యులను వివిధ ప్రాంతాలకు పంపడం జరిగింది.
దీనిలో భాగంగా గురువారం బొజ్జిగుప్ప, బెండలంపాడు, భద్రాచలం మరియు పూబెల్లి గ్రామ సభ్యులు మరియు సిబ్బంది తో కూడిన 25 సభ్యుల బృందాన్ని ములుగు జిల్లాలోని పసర అటవీ ప్రాంతంలో ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ సందర్శనకు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా భాగంగా అక్కడ ఉన్నటువంటి గుడారాలు, సహజ సిద్ధంగా కర్రలతో ఏర్పాటు చేసిన పందిళ్లు, మంచెలు మరియు క్రీడా మైదానాలను బృంద సభ్యులు పరిశీలించారు. సభ్యులు తమ గ్రామాల్లో కూడా ఇటువంటి ఏర్పాటు చేసుకొని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పరచటానికి ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
హైదరాబాద్ పర్యటన
దీనిలో భాగంగా బెండలంపాడు బ్యాంబు క్లస్టర్ నుండి ముగ్గురు, నాయకపోడు కోయఫుడ్ క్రాఫ్ట్ నుండి ఇద్దరు, బెoడాలంపాడు బాంబు క్లస్టర్ నుండి ఒకరి తో కలిసిన బృందాన్ని అక్టోబర్ నెలలో హైదరాబాద్ తీసుకువెళ్లి అక్కడ చౌటుప్పల్ లో వి లివ్ ఇన్ బాంబు నైన్ ను సందర్శించి అక్కడ వెదురుతో చేసిన వివిధ రకాల వస్తువులు,కళాకృతులు, వెదురు ఇల్లు మరియు ఫర్నిచర్ ను పరిశీలించి, వాటిని తయారు చేయడానికి కావలసిన నైపుణ్యాన్ని మరియు ఉపయోగించే పద్ధతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ లోని రాయలసీమ రుచులు హోటల్లో తాళి ఆహారం ఎలా ఉంటుందో తెలియజేయడం కొరకు బృందం సభ్యులు తీసుకుని వెళ్లి తాళి ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి, వాటిని ఇటువంటి పాత్రల్లో ఇవ్వడం జరుగుతుంది, దాని యొక్క రేటు, తయారీకి ఉపయోగించే పదార్థాలు మరియు హోటల్కు వచ్చిన వారికి ఇచ్చే ఆతిథ్యం తదితర అంశాలను సభ్యులకు తెలియజేశారు.తదుపరి సభ్యులను ఐ కీయ తీసుకువెళ్లి అక్కడ గిరిజనులు చేయగలిగే ఫర్నిచర్, లైటింగ్ లాంప్స్ మరియు చేతి కళావృత్తుల ను పరిశీలించారు. ఈ పర్యటన ద్వారా కొత్తగా ఫర్నిచర్ చెయ్యవచో వాటికి ఎటువంటి ఫినిషింగ్ ఇవ్వవోచు మరియు వాటికీ రేటు ఎలా నిర్ణయించాలి, వస్తువులకు మార్కెటింగ్ ఎలా కల్పించాలి అన్న విషయాల గురించి సభ్యులు తెలుసుకున్నారు.కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లా లోని ఊరవు వెదురు శిక్షణ కేంద్రం పరిశీలనకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భద్రాచలం ఐటిడిఏ టిడిఎం మరియు పెండాలంపాడు బ్యాంబు క్లస్టర్ నుండి 11 మందితో కూడిన సభ్యుల బృందంను తీసుకెళ్లడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా బృంద సభ్యులకు అధునాతన వెదురు తో తయారయ్యే కళాకృతుల తయారీ విధానం, వివిధ రకాల వెదురు, వాటిని కట్ చేసే విధానం, కళాకృతుల తయారీ విధానం, ట్రీట్మెంట్, వివిధ రకాల వెదురు ఉత్పత్తులు, ప్రొడక్షన్ ఫినిషింగ్ మరియు మార్కెటింగ్ విధానాల గురించి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.