ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 4 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
వివిధ అవసరాల కోసం తాసిల్దార్ కార్యాలయానికి వచ్చే సందర్శకులకు వేసవి తాపం నుంచి సేద తీరెందుకుగాను మణుగూరు తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. మంగళవారం మణుగూరు పర్యటనలో భాగంగా మణుగూరు తాసిల్దారు కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో వడగాలలో తీవ్రత అధికంగా ఉంటుందని, వృద్ధులు మరియు పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు తాసిల్దార్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.