ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
విద్యార్థులు చిన్నప్పటి నుంచే మంచి ఆలోచనలతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తద్వారా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేందుకు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం పాల్వంచలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వసతి గృహ ఉపాధ్యాయులు,సిబ్బందికి తగు సూచనలు చేశారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. విద్యార్థులకు వేడి నీరును అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వసతి గృహంలో బాలికలకు అందిస్తున్న సౌకర్యాలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారిని దాసరి అనసూయ, ఏఎస్సి డబ్ల్యూ ఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.