Site icon PRASHNA AYUDHAM

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

IMG 20250804 WA0197

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 4 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
కరకగూడెంలోని కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని సోమవారం భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీలో భాగంగా కలెక్టర్ పాఠశాల లోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, వంటగది మరియు మరుగుదొడ్లను పరిశీలించారు.తరగతి గదిలో విద్యార్థులతో మమేకమై వారికి అందుతున్న సదుపాయాలు విద్య బోధన ఏమైనా సమస్యలు ఉన్నాయా? మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో బాలికలకు సమగ్ర విద్యను అందించడంలో కస్తూరిబా బాలికల విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన వసతులు, భద్రతా ప్రమాణాలు, ఆరోగ్యకరమైన ఆహారం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రతి విద్యార్థి చదువులో ఉన్నత స్థాయికి చేరేందుకు అవసరమైన పరిసర వాతావరణం పాఠశాలలో ఉండాలి. మౌలిక వసతుల కల్పనలో రాజీ ఉండరాదు కలెక్టర్ స్పష్టం చేశారు.పరిసరాలు పరిశుభ్రత తప్పకుండా పాటించాలి.మరియు విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం అందించాలి అని ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనంఅందించాలన్నారు.
పాఠశాల ఆవరణలో మునగ, కరివేపాకు,ఉసిరి మొక్కలను విస్తృతంగా నాటాలన్నారు. విద్యార్థులకు ఔషధ మొక్కలు పై అవగాహన కల్పించాలని అన్నారు.పాఠశాలల్లో మురుగునీరు బయటకు వెళ్లేందుకు వీలుగా డ్రైనేజీ నిర్మించాలని దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి
అవుతున్నారని కలెక్టర్ దృష్టికి ఉపాధ్యాయులు తీసుకురాగా డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ కరకగూడెంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాలలో ఏర్పాటుచేసిన తరగతి గదిలు, మరుగుదొడ్లు ఇతర మౌలిక సదుపాయాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యత్యా సంవత్సరంలో నవోదయ పాఠశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.పరిశీలనలో కలెక్టర్ వెంట మండల విద్యాశాఖ అధికారి మంజుల, తాసిల్దార్ ఘంటా ప్రతాప్,డిప్యూటీ తాసిల్దార్ కాంతారావు, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, ఆర్ ఐ కృష్ణ ప్రసాద్ మరియు ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version