జిల్లా ప్రజలకు సంక్రాంతి, శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 14
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండగ సకల సంపదలతో విరజిల్లాలని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావడంతో పాటు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి పండగ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరిసిల్లాలి అన్నారు. అలాగే గాలిపటాలు ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now