*శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవార్లను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పేయి*
*మహాశక్తి ఆలయంలో వైభవంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు*
*6వ రోజు కాత్యాయని దేవి ( శ్రీ మహాలక్ష్మి దేవి)అవతారంలో అమ్మవారి దర్శనం*
*నాణేలు, తామర పువ్వులతో అమ్మవారి అలంకరణ*
*అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులు, భవానీ స్వాములు*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం అక్టోబర్ 8*
కరీంనగర్ మహాశక్తి ఆలయంలో మంగళవారం రోజున అమ్మవార్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పేయి దర్శించుకున్నారు ఆలయ నిర్వాహకులు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లకు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మంగళవారం( 6వ రోజు)కాత్యాయని ( శ్రీ మహాలక్ష్మి) దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లను ప్రత్యేకంగా నాణేలు, తామర పువ్వులతో అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది అమ్మవారి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బిజిబిజీగా గడిపారు. మొదట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాలు ముగిసిన వెంటనే సమస్యల గురించి ఏకరువు పెట్టుకోవడానికి వచ్చిన ప్రజలను కలిసి పరిష్కారం కోసం తనవంతు సహాయం చేశారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు.అనంతరం భవానీ భక్తులతో కలిసి బిక్ష చేశారు.శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అమ్మవారి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో దాండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బీజేపీకి చెందిన పలువురు రాష్ట్ర నాయకులతోపాటు ఇతర ప్రాంతాల నుండి భారీ ఎత్తున భక్తులు దాండియాకు హాజరై పాల్గొన్నారు