మున్సిపల్ ఎన్నికల ఓటర్ జాబితా సవరణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా జనవరి 07
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఐపీఎస్ మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసిన ఓటర్ జాబితాలో వచ్చిన అభ్యంతరాలను తక్షణమే పరిశీలించి సవరించి, ఫైనల్ ఓటర్ జాబితాను రేపు మధ్యాహ్నం 4.00 గంటల లోపు సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ & ప్రత్యేక అధికారి, ఆర్డీవో , ఎంఆర్ఓ , ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్, టీపీఓతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.