వయో వృద్దులు సమాజానికి జ్ఞాన బండాగారాలు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): వయోవృద్ధులు సమాజానికి జ్ఞాన బండాగారాలు అని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా మహిళా శిశు, వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు 2025ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. వయోవృద్ధులు మన సమాజానికి అపారమైన జ్ఞాన భాండాగారం అని, వారి అనుభవాలు, మార్గదర్శకాలు భవిష్యత్ తరాల నిర్మాణానికి దిక్సూచి లాంటివి అని అన్నారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చట్టాల పై సమగ్ర అవగాహన కల్పించాల‌ని సంబంధిత శాఖల అధికారులు, సంఘాల ప్రతినిధులను ఆమె సూచించారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 జిల్లాలో పటిష్టంగా అమలు అవుతుందన్నారు. ఈ చట్టం అమలు కోసం జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఈ చట్టం ద్వారా పరిష్కరించిన వివిధ కేసుల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. వివిధ రంగాలలో పని చేసిన వయోవృద్ధులు వారి అనుభవాలను భావితరాలకు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, వయోవృద్ధుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now