సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఉద్యోగులు, నిజాయితీ, నిష్పక్షపాతంగా, బాధ్యతాయుత భావనలతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని, అధికారులతో కలిసి విజిలెన్స్ ప్రతిజ్ఞ చేయించి, విజిలెన్స్ అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ.. వృత్తికి విలువతెచ్చేది నైతికత అని, విధినిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతంగా, నిజాయితీ విలువలను కాపాడడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి యొక్క బాధ్యత అని అన్నారు. పారదర్శకతతో మంచి పాలన సాధ్యమవుతుందని, సమగ్రతతో సేవలందించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవచ్చని ఆమె సూచించారు. ప్రతి శాఖాధికారి తన కార్యాలయంలో అవగాహన కార్యక్రమాలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించి సిబ్బందిలో బాధ్యత, సమగ్రత విలువలను పెంపొందించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.శ్రుత కీర్తి, ఎస్‌పి, రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆర్‌సీపురం యూనిట్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురి, సతీష్ రెడ్డి, డీఎస్‌పి, వివిధ శాఖల అధికారులు, ఆర్‌సీపురం యూనిట్‌కు చెందిన విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
అవినీతి నిర్మూలనకు అందరూ కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Oplus_16908288