విద్యార్థులకు కంప్యూటర్ బోధన తప్పనిసరి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ బోధన తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శుక్రవారం మునిపల్లి మండలం కంకల్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు విధానాన్ని పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల హాజరు శాతం పెంచి, శత శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. మనబడి కార్యక్రమంలో నిర్మించిన మధ్యాహ్న భోజన పథకం, షెడ్డును కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల వాతావరణం బాగుందని ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజన అందించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈడీఎస్ సీ కార్పొరేషన్/ మండల ప్రత్యేక అధికారి రామాచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment