సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజావాణి కార్యక్రమం కేవలం సమస్యలు వినే కార్యక్రమంగా కాకుండా, పరిష్కారాల వేదికగా నిలపాలని, వినతి ఇచ్చి వెళ్లిన తర్వాత వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 25 దరఖాస్తుల అందాయని తెలిపారు. ప్రజల నుండి వివిధ అంశాలకు సంబంధించిన ఫిర్యాదుల వినతి పత్రాలు అధికారులతో కలిసి స్వీకరించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, సంక్షేమ పథకాల అర్హత, మున్సిపల్ సమస్యలు వంటి అనేక అంశాలపై వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు నేరుగా అధికారులను కలుసుకొని తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించడం వల్ల పారదర్శక పరిపాలనకు తోడ్పడుతోందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని సమస్యలు పరిష్కరించే వేదికగా మార్చాలని, పేర్కొన్నారు. కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు అవసరమైన సూచనలు, సహాయం అందించడంలో అధికారులు, సిబ్బంది చురుకుగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ పద్మజారాణి, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: November 17, 2025 5:42 pm