సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): చెరుకు రైతుకు గిట్టుబాటు అయ్యేలా చక్కర కర్మాగారాల యజమాన్యాలు మద్దతు ధర నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో చక్కర కర్మాగారాల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు షుగర్ కేన్ ఇన్స్పెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి తదితరులతో కలిసి ప్రస్తుత సీజన్ లో చెరుకు క్రషింగ్, మద్దతు ధర నిర్ణయించడంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, రైతులు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు నష్టపోకుండా కంపెనీ నష్టపోకుండా రైతుకు గిట్టుబాటు అయ్యేలా మద్దతు ధర చెల్లించాలని రెండు రోజుల్లో మద్దతు ధరలతో పాటు రవాణాచార్జీల నిర్ణయం కూడా కంపెనీలు ప్రకటించాలని ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులకు సూచించారు. చక్కర ఫ్యాక్టరీల యజమాన్యాలు ఫ్యాక్టరీల యజమాన్యాలు తమ జోన్ పరిధి నాన్ జోన్ పరిధి రైతుల పట్ల వ్యత్యాసం చూపకుండా అధిక ధరను ప్రకటించాలని అన్నారు. చెరుకు యంత్రాల ద్వారా చెరుకు హార్వెస్టింగ్ చేసే రైతులకు తరువు శాతాన్ని నిబంధనల మేరకు తీసుకోవాలన్నారు. రైతుకు రైతుకు మధ్య వ్యత్యాసాన్ని చూపడం సరికాదన్నారు వ్యవసాయ అధికారుల సహాయంతో సహాయ చేరుకు కమిషనర్ పర్యవేక్షించి ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా రైతులందరికీ మద్దతు ధర అందేలా చూడాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ సమావేశంలో ఫ్యాక్టరీల ప్రతినిధులు కృష్ణమోహన్, యుగంధర్, వెంగల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, గోపి, చక్కర శాఖకు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి, నారాయణ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చెరుకు రైతుకు మద్దతు ధర అందేలా చూడాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Updated On: November 11, 2025 8:39 pm