సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వార్డులను, మెడికల్ స్టోర్ రూమ్ లో మందుల నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేక రకాల సౌకర్యాలను కల్పించింది అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి క్షేత్రస్థాయి సిబ్బంది అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసరంగా అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Oplus_131072