Site icon PRASHNA AYUDHAM

పకడ్బందీగా డాటా ఎంట్రీ. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

పకడ్బందీగా డాటా ఎంట్రీ.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

మెదక్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో సర్వే డాటా ఎంట్రీని పరిశీలించారు. ఆపరేటర్లకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్వే డాటా ఎంట్రీని పకడ్బందీగా చేయాలని ఏలాంటి తప్పులు లేకుండా చూడాలన్నారు.

ప్రతి దరఖాస్తును ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ఎంట్రీ చేయాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే ఉన్నతాధికారులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Exit mobile version