ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

ఎడపల్లి మండలం ఠాణకలాన్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి, కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

IMG 20241108 WA0204

ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… రైతుల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా 670 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసారి సన్న రకం, దొడ్డు రకం ధాన్యం సేకరణకై అన్ని రకాలుగా సామగ్రి అందుబాటులో ఉంచామని వివరించారు. కనీస మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ అందజేయనున్నదని, ఈ మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేశామని అన్నారు. అన్ని కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచామని, లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ సిద్ధిరమేశ్వర్, రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now