*జడ్పీ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ పర్యటన*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 11
కామారెడ్డి మండలం దేవునిపల్లి జడ్పీ హైస్కూల్లో విద్యార్థులు వివిధ రంగాల్లో (ఓకే నిమిషంలో స్టేట్ క్యాపిటల్స్ పేరు చెప్పడం తదితర) వారి ప్రతిభను ప్రదర్శించడంతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సంతోషం వ్యక్తం చేశారు. తర్వాత నోట్ బుక్స్ ను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నామని ప్రతి ఒక్క విద్యార్థి చదువు విలువ తెలుసుకొని కష్టపడి చదివి ఇష్టమైన రంగాలలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు.