ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి ఐసీసీ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 65 మంది దరఖాస్తుదారులు అధికారులకు సమస్యలు విన్నవించుకుంటూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై పూర్తి దృష్టి పెట్టి పరిష్కారాల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కాగా రెవిన్యూ శాఖ, 25 పౌర సరఫరాల శాఖ, 2 మార్క్ ఫెడ్,1 సర్వే ల్యాండ్ రికార్డ్, 9 పంచాయితీ, పిటి విభాగం, 4 పంచాయతీరాజ్, 2 మున్సిపల్ విభాగం, 9 వెల్ఫేర్ డిపార్ట్మెంట్,8 వ్యవసాయ శాఖ, 2 పోలీస్ శాఖ,1 రవాణా శాఖ, ఇతర రెగ్యులేటరీ శాఖలు, 2 మొత్తం 65 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజారాణి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now