Site icon PRASHNA AYUDHAM

కార్మికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలి: జిల్లా కల్లెక్టర్ వల్లూరు క్రాంతి

IMG 20250109 191843

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ముందు, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి సర్వే రిపోర్టును సమర్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో టీజీ ఐపాస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ పరిశ్రమల అనుమతుల ప్రక్రియ అంశాలపై జిల్లా పరిశ్రమల శాఖ, రెవెన్యూ శాఖ, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ క్రాంతి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు పరిశ్రమలలో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని, కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు తరుచు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి నెలా సమావేశానికి ముందు, చెక్‌లిస్ట్‌ను సమర్పించాలని సూచించారు. పరిశ్రమల అనుమతుల కోసం దరఖాస్తులు ఆన్లైన్‌లో అందుబాటులోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేయాలని స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖ, అధికారులు 9 పరిశ్రమలకు సంబంధించిన కూల్ ఎధనాల్ ముడి పదార్థాల కేటాయింపుపై పరిశ్రమల శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ అప్లికేషన్స్ ఆమోదించబడినవని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జా నాయక్, ఆర్డిఓ రవీందర్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version