Site icon PRASHNA AYUDHAM

కలెక్టరేట్ లో పరిశుభ్రత పాటించాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ ప్రాగణంలో పరిశుభ్రతపై చర్యలు చేపట్టారు. అందులో భాగంగా బుధవారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం తిరిగి కలెక్టర్ పరిశీలించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టరేట్ సముదాయంలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ పరిశుభ్రత పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ లో పరిశుభ్రత లోపిస్తే సంబంధిత శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాల వద్ద పరిశుభ్రత ఆయా శాఖల అధికారులదే బాధ్యత అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం కచ్చితంగా అమలు చేయాలన్నారు. కలెక్టరేట్లో ప్రజల కోసం తాగునీరు కోసం ఫిల్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ లో జరిగే సమావేశాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు. కలెక్టరేట్లో పరిశుభ్రతపై ప్రతి అధికారి బాధ్యత వహించాలన్నారు. కలెక్టరేట్ మెయింటెనెన్స్ చార్జెస్ ను సంబంధిత శాఖల అధికారులు అప్పటికప్పుడు చెల్లించాలన్నారు. అన్ని శాఖల కార్యాలయాల వద్ద పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్ కార్యాలయంకు వచ్చే వాహనాలు క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏఓ పరమేష్ ను ఆదేశించారు. ప్రైవేట్ వ్యక్తులు తమ వాహనాలను అధికారిక పార్కింగ్ లో పెట్టకుండా చూడాలని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశించారు. అధికారులు తమకు కేటాయించిన వాహనాలను కేటాయించిన పార్కింగ్లో నిలుపుకోవాలని సూచించారు. అధికారిక వాహనాలకు స్టిక్కరింగ్ లో ఏర్పాటు చేయాలని అన్నారు. కలెక్టరేట్ సిబ్బంది వివిధ శాఖల సిబ్బందికి, శాఖల అధికారులకు సిబ్బంది వాహనాల కు స్టిక్కర్స్ వేయించాలని సూచించారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కలెక్టరేట్లో ప్రవేశించేవాహనాలకు స్టిక్కర్లు, సిబ్బందికి ఐడి కార్డు ఉంటేనే కలెక్టరేట్ కార్యాలయంలోకి అనుమతించాలని అన్నారు. నో పార్కింగ్ జోన్ లో వాహనాలు పెట్టి వెళ్లి పొతే జరిమానా విధించాలని కలెక్టరేట్ ఏవోను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ శాఖలకు కేటాయించిన బ్లాకులు పరిశుభ్రత ఆయా శాఖల హెచ్వోడీలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్ చుట్టూ అన్ని కోణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిఆర్ ఓ పద్మజారాణిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డిఎస్పీ సత్తయ్య గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version