ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం కంది మండలం చేర్యాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కంది మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా చేర్యాల గ్రామాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో జిల్లా స్థాయి అధికారుల నిఘా ఉంచి పనులు వేగవంతంగా జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో 65 ఇళ్ళు మంజూరు చేయగా 12 ఇళ్ళు బెస్మిట్స్ స్థాయిలో ఉన్నట్లు ప్రస్తుతం మూడు ఇండ్లు నిర్మాణ స్థాయిలో ఉన్నట్లు అధికారుల బృందం వీటిని పరిశీలించింది. ఈ సందర్భంగా కలెక్టర్ తనిఖీ చేసి పనుల నాణ్యత, నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. ఇల్లు పూర్తిగా లేని అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ప్రభుత్వం ఇండ్లు నిర్మించి అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఇండ్లను 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని కలెక్టర్ తెలిపారు.

*మోడల్ హౌస్ ను పరిశీలించిన కలెక్టర్*

కంది మండలం కేంద్రంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మోడల్ హౌజ్ ను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం పరిశీలించారు. మోడల్ హౌస్ నిర్మాణం పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. మిగతా ఇండ్ల నిర్మాణం పనులు కూడా వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తిగా ఇండ్లు నిర్మించి ఇస్తుండడంతో పతకం అమలు మరింత వేగంతో అవుతుందన్నారు. ప్రభుత్వ విధానాలు ఇది నిదర్శనం అన్నారు. లబ్ధిదారులు వీటి ప్రయోజనాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పైలెట్ ప్రాజెక్టులో నీటిపారుదల వసతి మౌలిక వసతులు కల్పనతో పాటు ఇంటి పరిసరాలు మంచి నీటి సరఫరా మురుగునీటి పాడుదల వ్యవస్థ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు ఇండ్ల పథకంపై అవగాహన కల్పించి వారి ఇండ్ల నిర్మాణం మెరుగుపరిచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు ఇండ్ల నిర్మాణం నాణ్యత పై మరింత దృష్టి సారించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయడం లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడి హౌసింగ్ చలపతిరావు, ఏఈ మాధవరెడ్డి, తహసిల్దార్ విజయలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment