జిల్లాలో సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 69 దరఖాస్తుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు. రెవెన్యూ శాఖ 25, పౌర సరఫరాల శాఖ 02, సర్వే ల్యాండ్ 3, పంచాయతీ అండ్ పి టి విభాగం 7, పంచాయతీరాజ్ 4, డి.ఆర్.డి.ఓ 3, మున్సిపల్ 10, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 5, విద్యాశాఖ 2, వ్యవసాయ శాఖ 3, పశు వైద్య శాఖ 2, వైద్య అండ్ ఆరోగ్యశాఖ 3 వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. ప్రతి అర్జీపై తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల ప్రధాన సమస్యలపై పూర్తి దృష్టి పెట్టి, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డీ.ఆర్‌.ఓ పద్మజ రాణి, జడ్పీసీఈఓ జానకి రెడ్డి, ఆర్.డి.ఓ లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now