పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కొమురంభీమ్ ఆసిఫాబాద్ డిసెంబర్ 11,

ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు గూడు కల్పించాలని ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లను అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం నియోజకవర్గానికి 3 వేల 500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో దరఖాస్తుదారుల వివరాలు, భూ సంబంధిత డాక్యుమెంట్లు, ఇతర వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారుల వివరాల నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అధికారులు, సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఈ- డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్, హౌసింగ్ డి.ఈ. వేణుగోపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాలుగోన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment