ప్రత్యేక దత్తత సంస్థను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్.

*ప్రత్యేక దత్తత సంస్థను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్…*

IMG 20241112 WA00431

అనకాపల్లి జిల్లా నందు గల మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం లో గల ప్రత్యేక దత్తత సంస్థను జిల్లా కలెక్టర్, విజయ కృష్ణన్ చేతుల మీదిగా ప్రారంభించటం జరిగినది.

ఈ ప్రత్యేక దత్తత సంస్థ నందు 0 నుండి 6 సంవత్సరాల వయస్సు మధ్య గలిగిన (తల్లి దండ్రులు కోల్పోయిన పిల్లలు, వదిలి వేయబడిన పిల్లలు, తల్లి దండ్రులు బిడ్డను పెంచుకోలేక సంస్థకు అప్పగించిన పిల్లలు) వీరి కోసం ఈ సంస్థ 24 గంటలు పనిచేస్తుంది. ఈ సంస్థ నందు మేనేజర్, సామాజిక కార్య కర్త, ఏ. ఎన్. ఎమ్, ఆయాలు చౌకీదార్ సిబ్బందిగా పనిచేస్తుంటారు. ఈ సంస్థ నందు గల పిల్లలను కేంద్ర దత్తత వనరుల సంస్థ ద్వారా పిల్లలు లేని వారు దత్తత కొరకు ధరఖాస్తు చేసుకొన్న వారికి దత్తత యిచ్చుట కొరకు పని చేస్తుంది. కలెక్టర్ తెలిపారు…

Join WhatsApp

Join Now