సమగ్ర కుల గణన డాటా ఎంట్రీ ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

*సమగ్ర కుల గణన డాటా ఎంట్రీ ని పరిశీలించిన జిల్లా కలెక్టర్*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ కుల గణన సర్వే డాటా ఎంట్రీ ని బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయం లో సోమవారం రోజున జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి పరిశీలించం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డాటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎన్యుమరేటర్లు కలిసి తప్పులు లేకుండా, ప్రతి కుటుంబం యొక్క వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసి, భద్ర పరచాలని సూచించారు. డాట ఎంట్రీ ఆపరేటర్స్ కు శిక్షణ ఇవ్వాలని కోరారు. డిసెంబర్ మొదటి వారం వరకు నమోదు పక్రియ పూర్తి చేసేలా చూడాలని తెలియజేశారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ప్రతి రోజు భోజనం అందిస్తున్నారా, సమస్యలు ఏం ఉన్నాయి అని అడుగగా, విద్యార్థులు లైబ్రరీ, డార్మెటరీ, కంప్యూటర్ లు సమకూర్చాలని కోరడం జరిగింది. వెంటనే స్పందించిన కలెక్టర్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వసతుల కల్పన కు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె ప్రవీణ్, ఎంపీవో మంజుల, డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, కేజీబీవి ప్రిన్సిపాల్ శ్వేత, ఉపాధ్యాయినిల బృందం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment