తలమడ్ల పాఠశాలలోని కిచెన్ షెడ్ మారమ్మతుకు 50 వేల నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్

తలమడ్ల పాఠశాలలోని కిచెన్ షెడ్ మారమ్మతుకు 50 వేల నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 4

 

తలమడ్ల పాఠశాలలోని కిచెన్ షేడ్, అభివృద్ధికి శుక్రవారం జిల్లా కలెక్టర్ 50 వేల నిధులను మంజూరు చేశారు. తలమడ్ల ప్రాథమిక పాఠశాల ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. ఇందులో భాగంగా ఎండిఎం పర్యవేక్షించి విద్యార్థులతో యూనిఫామ్, మధ్యాహ్న భోజనం రుచి, టెక్స్ట్ బుక్స్ గురించి మాట్లాడి సంతృప్తిని వ్యక్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న కిచెన్ షెడ్ను పరిశీలించి దాని మరమ్మత్తులకు 50 వేల రూపాయలు మంజూరు చేశారు. ఇందుకు పాఠశాల సిబ్బంది మరియు ఎస్ఎంసి చైర్మన్ సభ్యులు గ్రామస్తులు కలెక్టర్ కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటరూ. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పూర్ణచంద్ర రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, ఉపాధ్యాయులు కవిత, దుర్గా ప్రసాద్, గంగా మోహన్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment