Site icon PRASHNA AYUDHAM

ఝరాసంఘం మండలంలోని బర్దిపూర్ పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

IMG 20250725 173137

Oplus_0

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఝరాసంఘం మండలం బర్దిపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ.. బడి వయసు గల పిల్లలు ఎవరు బడి బయట ఉండకూడదని, బడి పిల్లలు, మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి పాఠశాలలలో చేర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థుల పఠన సామర్థ్యం పెంపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతిగదులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, విద్యార్థుల హాజరు, వంటి అంశాలను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. తరగతి గదిలను పరిశీలిస్తూ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల అభ్యస విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులందరికీ యూనిఫారమ్స్, పాఠ్య పుస్తకాలు అందరికి అందాయి అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో కాంపౌండ్ వాల్ లేకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. అలాగే ఇతర మౌలిక సదుపాయాల కల్పనపైనా ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కల్లెక్టర్ మాధురి, జహీరాబాద్ ఆర్డిఓ రామ్ రెడ్డి , సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Exit mobile version