*ఇందిరమ్మ ఇండ్లను పర్యటించిన జిల్లా కలెక్టర్*

*ఇందిరమ్మ ఇండ్లను పర్యటించిన జిల్లా కలెక్టర్*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 28.

 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

 

సోమవారం జిల్లా కలెక్టర్ పాల్వంచ మండల కేంద్రంలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ లబ్ధిదారు పొన్నాల రాజేశ్వరి ఇంటిని పరిశీలించి ఇంటి నిర్మాణానికి ఇసుక, మొరం మరియు పేమెంట్ కు ఎలాంటి ఇబ్బంది కాకుండా అధికారులు చూసుకుంటారని ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పాల్వంచ మండల కేంద్రంలో 34 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 23 ఇండ్లు నిర్మాణం ప్రారంభమైనయని వాటి నిర్మాణంలో వేగం పెంచడంతోపాటు మిగతా ఇండ్ల నిర్మాణం త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీపతి, తాసిల్దార్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now