తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ యు జే ఐ) ములుగు జిల్లా కమిటీ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దివాకర టి ఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి శాలువాతో సత్కరించి,టి ఎస్ జే యు రాష్ట్ర కమిటీ నుండి వచ్చిన ములుగు జిల్లా కమిటీ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన ములుగు జిల్లా కమిటీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని,వాస్తవిక వార్తలను వెలికితీయాలని,జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలను అందిస్తానని ఆయన అన్నారు.అనంతరం ములుగు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి హెచ్ మహేందర్ జి, డిపిఆర్ఓ రఫిక్ లను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. డి పి ఆర్ ఓ కు టి ఎస్ జే యు ములుగు జిల్లా కమిటీ నియామక పత్రాన్ని అందజేశారు, ఈ సందర్భంగా ఎన్నికైన జిల్లా కమిటి కి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. డిపిఆర్ఓ కార్యాలయం నుంచి విలేకరులకు పూర్తి సమాచారము, సంబంధిత సేవలను ఎల్లవేళలా అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ ఎస్ జే యు ములుగు జిల్లా గౌరవాధ్యక్షుడు పడమటింటి నగేష్, అధ్యక్షుడు చల్లగురుగుల రాజు, ప్రధాన కార్యదర్శి సంగ రంజిత్ కుమార్, ఉపాధ్యక్షుడు కూనూరు మహేందర్,జాయింట్ సెక్రెటరీ తడక హరీష్, కోశాధికారి పొన్నాల స్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచర్ల రాజు, ఈసీ మెంబర్ కవ్వంపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
