తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్న చూపు… జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ 

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్న చూపు…

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్

ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 2

కామారెడ్డి/బీబీపేట్,ఫిబ్రవరి 2,తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలో వున్న బీజేపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధికంగా నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు, ప్రత్యేక నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతులకు, పేదలకు , మేలు చేసే విధంగా లేదన్నారు బిహార్‌, ఏపీ వంటి రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణ ను విస్మరించిదన్నారు రాష్ర్టంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కలసి విన్నవించిన నిధులివ్వకుండా నిర్లక్ష్యం చూపిందన్నారు.తెలంగాణ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బడ్జెట్‌పై కేంద్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందని రైతులను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment